మాజీ మంత్రి కొడాలి నాని ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిక

kodali nani

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన ఛాతీ నొప్పి (chest pain) రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital)కి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గతంలో గుండె సంబంధిత (heart-related) సమస్యలతో కొడాలి నాని చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు ఛాతీ నొప్పి రావడం గుండె సమస్య కారణంగా వచ్చిందా? లేదా గ్యాస్ట్రిక్ (gastric) సమస్యల వల్ల ఉత్పన్నమైందా? అనే అంశంపై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కొడాలి నాని ఆసుపత్రిలో చేరిన వార్తతో వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా వైద్యులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Read More : ప్రస్తుతం రాజకీయాలపై ప్రముఖ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు