గుంటూరు (Guntur): గుంటూరు జిల్లాలో విషాదం (Tragedy) చోటుచేసుకుంది. బీసీ వసతి గృహం (BC Hostel)లో నీటి కొరత (Water Shortage) కారణంగా చెరువుకు (Pond) వెళ్లిన పదో తరగతి విద్యార్థి (10th Student) జారిపడి మృతి చెందాడు. గురువారం ఉదయం ముగ్గురు విద్యార్థులు నీటి కోసం వట్టి చెరుకూరు (Vatti Cherukuru) చెరువుకు వెళ్లగా, వారిలో ఓ విద్యార్థి చెరువులోకి జారి మునిగిపోయాడు.
స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు విద్యార్థులు కూడా చెరువులో పడిపోయారు. ఊహించని ఈ ఘటనను గమనించిన గ్రామస్థులు (Villagers) తక్షణమే స్పందించి ఇద్దరు విద్యార్థులను రక్షించగలిగారు. అయితే, కిషోర్ (Kishor) అనే విద్యార్థి గల్లంతయ్యాడు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అతడిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. మృతుడు వెల్దుర్తి మండలం (Veldurthi Mandal), గంగలకుంట గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read More : మాజీ మంత్రి కొడాలి నాని ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిక
