తనపై ఫిబ్రవరి 7న జరిగిన దాడి నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తనను రక్షించాడని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ (Rangarajan) పేర్కొన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన, ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు.
శ్రీవారి కృప వల్లనే ప్రాణాలు దక్కాయి
తనపై జరిగిన భయంకరమైన దాడి తర్వాత కలియుగ వైకుంఠం తిరుమలను దర్శించాలని తాను ఆకాంక్షించానని తెలిపారు. ఈ క్రమంలో స్వామివారి పాదపద్మాలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలపాలని తిరుమలకు వచ్చానని రంగరాజన్ చెప్పారు.
టీటీడీ భక్తుల కానుకలను ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలి
అదేవిధంగా, భక్తులు సమర్పించే కానుకలను రోడ్లు, నిర్మాణ పనులకు కాకుండా, ధర్మ పరిరక్షణ, వేద ధర్మ ప్రతిష్ఠ కోసం వినియోగించాలన్నది తన అభిప్రాయమని రంగరాజన్ అన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తిరుమలలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు
తిరుమలలో భక్తులకు అత్యుత్తమ సేవలందించేందుకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారని, ఇవి ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు. చిన్నచిన్న దేవాలయాల్లో నిత్య కైంకర్యాలకు అవసరమైన నిధులను టీటీడీ సమకూర్చేలా చూడాలని కోరారు.
Read More: వైఎస్ షర్మిల ఆగ్రహం: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీసీసీ చీఫ్

One thought on “తిరుమలేశుడే నన్ను కాపాడాడు: చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్”
Comments are closed.