అభ్యర్థుల డిమాండ్‌పై స్పష్టం

nara lokesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలోని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో పూర్తి అయింది. పరీక్షలు జూన్ 6 నుండి ప్రారంభం కానున్నాయి.

అయితే, డీఎస్సీకి 90 రోజుల ప్రిపరేషన్ టైమ్ కావాలన్న డిమాండ్ అభ్యర్థుల మధ్య విస్తృతంగా వినిపిస్తోంది. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే అభ్యర్థులు ఈ డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

ఇలాంటి తరుణంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “డీఎస్సీని ఆపేందుకు వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు కొందరు సమయం పెంచాలంటున్నారు. కానీ మేము గతేడాది డిసెంబర్‌లోనే సిలబస్‌ను ప్రకటించాం. దీంతో ఏకంగా ఏడు నెలల సమయాన్ని అభ్యర్థులకు అందుబాటులో ఉంచాం” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలతో మెగా డీఎస్సీ పరీక్ష గడువు పెంపు ఉండదని స్పష్టమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇప్పుడిప్పుడే సన్నద్ధమవుతూ తమ సన్నాహాలను ముమ్మరం చేస్తున్నారు.

Read More : కీలక వ్యాఖ్యలు చేసిన జైశంకర్

One thought on “అభ్యర్థుల డిమాండ్‌పై స్పష్టం

Comments are closed.