హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు సంతోషకరమైన వార్త. మెట్రో రైళ్ల చివరి ట్రైన్ సమయాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, మార్చి 22 నుంచి ఈ సమయాన్ని మరో గంట పాటు పెంచింది. తాజా మార్పుల ప్రకారం, రాత్రి 12:15 గంటలకు చివరి మెట్రో బయలుదేరి, గమ్యస్థానాన్ని 1:10 గంటలకు చేరుకోనుంది.
ఐపీఎల్ 2025 సీజన్‌కు అనుగుణంగా నిర్ణయం
హైదరాబాద్ మెట్రో తాజా నిర్ణయం ప్రధానంగా ఐపీఎల్ 2025 సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసిన అభిమానులు రాత్రి 12:15 గంటలకు ఉప్పల్, నాగోల్, ఎన్‌జీఆర్ఐ స్టేషన్ల నుంచి చివరి మెట్రో ఎక్కే వీలు కల్పించింది. సాధారణ ప్రయాణీకులకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఈ మార్పుతో క్రికెట్ అభిమానులలో హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి రాత్రి సమయాల్లో మెట్రో అందుబాటులో ఉండటంతో, మ్యాచ్ అనంతరం వారు ఇంటికి సులభంగా చేరుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2025 సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరగనుంది. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది.
Read More : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ సన్నీ యాదవ్‌పై లుకౌట్ నోటీసులు

One thought on “హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త: రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పు”
Comments are closed.