పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదల – హైకోర్టు బెయిల్ మంజూరు

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, సంబంధిత పత్రాలు ఆలస్యంగా సమర్పించడంతో శనివారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.

అరెస్టు నుండి విడుదల వరకు…

ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్ ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. మార్ఫింగ్ కేసు, అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో రాజంపేట కోర్టులో హాజరుపర్చిన పోలీసులు, కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను జైలుకు తరలించారు. అంతేకాకుండా, ఏపీ పలు జిల్లాల్లో పోసానిపై 16 కేసులు నమోదవడంతో ఆయా కోర్టుల్లో PT వారెంట్‌పై హాజరు పరచారు.

సీబీఐ విచారణ – బెయిల్ ఆలస్యం

రాజంపేట, నరసరావుపేట కేసులతో పాటు ఇతర కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరైనా, ఇటీవల CID అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో ఆయన విడుదలకు బ్రేక్ పడింది. శుక్రవారం హైకోర్టు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేయడంతో చివరికి గుంటూరు జైలు నుంచి విడుదల అయ్యారు.

భావోద్వేగానికి లోనైన పోసాని

జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి లోనయ్యారు. గత నెల రోజులుగా జైలులో ఉన్న అనుభవాలను మీడియా ముందు వివరించేందుకు ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ కేసు పరిణామాలు, తనపై తప్పుడు ఆరోపణలు వస్తున్నాయంటూ పోసాని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Read More : తూర్పు గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహ అవమానంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం