విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులకు లైంగిక విద్య (Sex Education) బోధించడంతో పాటు, నైతిక విలువలు నేర్పే విధంగా మోరల్ ఎడ్యుకేషన్ (Moral Education)ను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. విద్యార్థులు ఆరోగ్యకరమైన శారీరక, మానసిక అవగాహనను పెంపొందించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడంతో పాటు, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. పిల్లలు సరైన దిశగా ఆలోచించేలా, సమాజంలో ధృడమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
ఇందుకోసం నిపుణుల సహాయంతో ప్రత్యేక పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. విద్యార్థులకు లైంగిక విద్యను ఎలాంటి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంచి, ఆరోగ్యపరమైన, సమగ్ర దృక్పథంతో బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కల్పించి, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది.
ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఏమంటారో చూడాలి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read More : ఎవెరెస్ట్ బేస్ క్యాంప్‌ను ఒక్కరే అధిరోహించిన 59 ఏళ్ల కేరళ మహిళ

One thought on “కర్ణాటకలో ఎనిమిది నుండి పదో రెండో తరగతి విద్యార్థులకు లైంగిక విద్య, నైతిక విద్య బోధన తప్పనిసరి”
Comments are closed.