వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోవడం తమకు కొత్తకాదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నామని, కన్నుమూసి కన్ను తీరిచేలోపు ఏడాది గడిచిందని, మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వైసీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు.
జగన్ మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామని, వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకముందని అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెనలకు సంబంధించి ఇవాళ యాధృచ్ఛికంగా నిరసన కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంపై విమర్శలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని జగన్ విమర్శించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు రూ. 2800 కోట్లు అవసరమని, వసతి దీవెనకు రూ. 1100 కోట్లు కావాలని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది కేవలం రూ. 700 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. విద్యార్థులకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడంతో వారి చదువుకు ఆటంకం ఏర్పడిందని ఆయన తెలిపారు.
యువత పోరాటంపై వ్యాఖ్యలు
జగన్ మాట్లాడుతూ, “వైసీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, వారి గొంతుకగా పోరాడుతుందని” అన్నారు. పోరుబాటలో పాల్గొంటున్న యువత, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లుగా వైసీపీతో పాటు నిలబడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు.
మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల్లో భాగంగా ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ. 788 కోట్లు చెల్లించిందని తెలిపారు. మిగిలిన బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడతల వారీగా చెల్లిస్తున్నారని వివరించారు.
దొన్నుదొర మాట్లాడుతూ, గత వైసీపీ పాలన వల్ల రాష్ట్రం వెనుకబడిపోయిందని, రహదారులకు గోతులు పూడ్చలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారుల మరమ్మతులు జరిపి ప్రజలకు ఉపశమనం కలిగించిందని ఆయన తెలిపారు.

One thought on “జగన్ విమర్శలు: ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్తకాదని స్పష్టం”
Comments are closed.