రఘునందన్ రావు: కవితపై తీవ్ర విమర్శలు, కేటీఆర్‌పై ప్రశ్నలు

రఘునందన్ రావు: కవితపై బీజేపీ ఎంపీ తీవ్ర విమర్శలు

సంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయని, ఇప్పటికీ ఆమె ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుందని చెప్పారు. ఆమెకు మంచి డాక్టర్‌కి చూపిస్తే ఆరోగ్యం బాగుపడుతుందని సలహా ఇచ్చారు. కవిత పసుపు బోర్డు పోరాటం వల్ల వచ్చినదని చెప్పిన విషయంపై స్పందిస్తూ, ఎంపీ రఘునందన్ రావు ఆమెకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

రఘునందన్ రావు మాట్లాడుతూ, పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు రైతులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. “కేటీఆర్ కు రైతుల మీద ప్రేమ పెరిగిందా?” అని కూడా అన్నారు.

కేవలం కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్‌కు అవమానం జరిగిందని, కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలుగా అంబేద్కర్‌నే గౌరవించలేదని ఎంపీ విమర్శించారు. 1950లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, రెండోసారి ప్రధానిగా ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని అన్నారు.

ఇదిలా ఉండగా, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన వర్క్‌షాప్‌లో పాల్గొని, “రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన అవినీతి మయంగా మారింది” అని అన్నారు.

ఈ వార్త కూడా చదవండి