బండి సంజయ్ తీవ్ర విమర్శలు – ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపాటు

బండి సంజయ్: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. మోదీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

బండి సంజయ్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి

బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా నిధులు అందిస్తున్నదని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రైతులకు అన్నివిధాలా సహాయం అందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ గ్యారెంటీ స్కీముల్లో ఎన్ని అమలయ్యాయో చెప్పేందుకు సిద్ధమా? అని డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు.

సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్

ఈ రోజు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ, కేంద్రం అందించిన నిధులు, గ్రాంట్లు గురించి తాము చర్చ చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను నమ్మడంలేదని, తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.

కిషన్ రెడ్డి: రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది

యాదాద్రి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

Read More