పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్: నా వల్ల చనిపోయారనే వేదన బన్నీ లో ఉంటుంది
అల్లు అర్జున్ (Allu Arjun) వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన పవన్, గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయం అని చెప్పారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని, కింద నుంచి ఎదిగిన వ్యక్తి అని అన్నారు. వైసీపీ విధానాలతో అక్కడ వ్యవహరించలేదని చెప్పారు. అక్కడ బెన్‌ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపుతో అవకాశం ఇచ్చారని చెప్పారు. ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమను, ఆదరణను చూపుతారని చెప్పారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారని అన్నారు.”
అల్లు అర్జున్ విషయానికి వస్తే, “ముందు మరియు వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. కళాకారులకు ఒక పొగడ్త, అవార్డు అనేది చాలెంజింగ్ గా ఉంటుంది. సినిమా థియేటర్‌కు వెళ్లడం మనం ఎప్పుడో మానేశాం. ఈ విషయంలో పోలీసులు భద్రత గురించి ముందుగా ఆలోచించారని అన్నారు. విజయనగరంలో నన్ను కూడా ముందే నిలిపి చెప్పారు. చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు. నేనూ అలానే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది, అయితే ఆయన వెళ్లి కూర్చున్నాక… తరువాత పరిస్థితిని చూసి తీసుకెళ్లాల్సింది” అని అన్నారు.
“చట్టం అందరికీ సమానమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అర్జున్‌కు చెప్పి ఉండినా, ఆ అరుపుల్లో ఆయనకి వినిపించకపోవచ్చు. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే రచ్చ కాకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. ‘గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారు’ అనేది నా అభిప్రాయం” అని అన్నారు.
“ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే, ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ చేస్తారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంటుంది. వెళ్లి ఆ బిడ్ట కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. సినిమా అంటే టీమ్… అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
