దిల్ రాజు: పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను కలిసిన దిల్ రాజు, రామ్ చరణ్ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
