ఢిల్లీ పర్యటనలో సీఎం !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సాయంత్రం 6 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అందించి, ఆర్థిక సహాయం కోరనున్నట్లు సమాచారం. సాస్కి ప్రాజెక్ట్‌తో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర నిధులు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేయనున్నారు.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరమ్ సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. అదే రోజు రాత్రి ఆయన అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.

Read More : ఏ1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తుల జప్తు