తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ చేరుకొని తెలుగు డయాస్పొరా మీట్‌లో పాల్గొననున్నారు

అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరియు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ (Zurich) చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరగా, సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిక్‌కు వెళ్లారు. వీరిద్దరూ సోమవారం ఉదయం జ్యూరిక్ చేరుకున్నారు. జ్యూరిక్‌లోని హోటల్ హిల్టన్ (Hotel Hilton)లో నిర్వహించే “తెలుగు డయాస్పొరా మీట్” (Telugu Diaspora Meet)లో వీరిద్దరూ పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొననున్నాయి. ఈ సమావేశాన్ని స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసింది. చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ సమావేశం అనంతరం రోడ్డుమార్గాన దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాల్లో తెలుగు ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరవుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి

One thought on “తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ చేరుకొని తెలుగు డయాస్పొరా మీట్‌లో పాల్గొననున్నారు

Comments are closed.