గాల్లో ఉండగా విమానంలో మంటలు: ఇటలీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

గ్రీస్‌ నుంచి జర్మనీకి వెళ్తున్న ఓ బోయింగ్-757 విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి, ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

273 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Read More : ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక పరిణామాలు

One thought on “గాల్లో ఉండగా విమానంలో మంటలు: ఇటలీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Comments are closed.