సత్తెనపల్లి పర్యటన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతిచెందిన సింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఈరోజు ఆర్థిక సహాయంగా రూ.10 లక్షల చెక్కును మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇతర వైసీపీ నేతలు కలిసి సింగయ్య కుటుంబానికి అందజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి తమపరంగా ఈ సహాయం చేస్తోందని, ఈ బాధాకర సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు, స్థానికులు సింగయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైసీపీ సమాజం పట్ల తన బాధ్యతను చాటుకుంటోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Read More : విశాఖలో మోదీ యోగా పర్యటన

One thought on “సింగయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సహాయం”
Comments are closed.