ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన అనుభవాలను గుర్తుచేస్తూ సెటైర్లు వేసారు.
“ఈ సారైనా అమరావతి కట్టేనా? లేక మళ్లీ మాట్టేనా? పది ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారు. మన ఆశల మీద నీళ్లు చల్లి వెళ్లారు” అంటూ వైఎస్ షర్మిల తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా స్పందించారు.
మోదీ పర్యటనపై ఆమె చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతి నిర్మాణంపై గతంలో జరిగిన వైఫల్యాలను ఎత్తిచూపుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలు గమనార్హంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా ఆమె X ఖాతాలో@realyssharmila అనే హ్యాండిల్స్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read More : వైఎస్ షర్మిల అరెస్ట్…
