మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు. గత ఐదేళ్లలో అన్నిరంగాలు క్షీణించాయని, ముఖ్యంగా రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకొల్లు మండలంలో రూ.86 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, రూ.14 కోట్లతో నిర్మిస్తున్న దమయపర్తి మురుగునీటి కాల్వ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
అమరావతిని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారనీ, రాష్ట్రంలో అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా ఉండటంతో తాగునీరు, సాగునీరు సమస్యలు ఎదురయ్యే అవకాశమే లేదని చెప్పారు.
అంతేకాకుండా, ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాల వేసి, కార్మికులతో కలిసి రిక్షా తొక్కారు. కార్మిక సంఘాలతో మమేకమై ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్న ప్రగతి దిశగా ముందుకెళ్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Read More : జగన్‌కు కూటమి ప్రభుత్వం ఆహ్వానం

One thought on “జగన్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది”
Comments are closed.