ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర విభజన హామీల అమలుపై లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. శర్మిల మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 25 మంది లోక్‌సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. కానీ వీళ్లంతా ఏమి చేస్తున్నారు? ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేకపోయాం. ఇది ఎంపీల వైఫల్యం కాకపోతే మరేమిటి?” అని ప్రశ్నించారు.
అలాగే, ప్రతి పార్టీ నేతలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించిన ఆమె, ప్రజల సమస్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “పార్లమెంట్‌లో ప్రజల తరఫున మాట్లాడలేకపోతే, వీళ్లను ఎంపీలుగా ఎందుకు ఎన్నుకున్నాం?” అంటూ ఎంపీలపై మండిపడ్డారు.
Read More : ఆ మాట జేసీ ప్రభాకర్ భార్య చెబితే క్షమాపణ చెబుతా – పెద్దారెడ్డి

One thought on “విభజన హామీలపై ఎంపీలు విఫలమయ్యారా? – వైఎస్ షర్మిల ఫైర్”
Comments are closed.