హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంభాషణలను కూడా వింటున్నారని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ సాధారణమని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ వ్యాఖ్యలు అసహజమని కౌశిక్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ను సహజమని చెప్పిన ముఖ్యమంత్రిపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలతో పాటు సొంత మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇక రేవంత్ రెడ్డి తమపై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే, ఆయన ఎవరెవరితో తిరిగారో పదహారు మంది పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. జూబ్లీహిల్స్, ఢిల్లీ, దుబాయ్‌లలో సీఎం ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలుసునని ఘాటుగా వ్యాఖ్యానించారు. మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Read More : బంజారాహిల్స్‌లో టౌన్ ప్లానింగ్ అధికారులకు కత్తి బెదిరింపు

One thought on “సంచలన ఆరోపణలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి”
Comments are closed.