అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జగన్ శుభాకాంక్షలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో కోట్లాది మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే సందేశాన్ని ఇచ్చారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన సందేశంలో, యోగా శరీరం, ఆత్మ రెండింటిని శక్తివంతంగా మార్చే సాధనమని పేర్కొన్నారు.

“ప్రశాంతతను పెంపొందించడంలో యోగా ముఖ్యపాత్ర వహిస్తుంది. మన దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజు కొద్దిసేపైనా యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు” అంటూ జగన్ పిలుపునిచ్చారు.

యోగా ద్వారా వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా, సమాజంలోనూ సానుకూల మార్పులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. యోగా విధానాన్ని అందరూ స్వీకరించాలని సూచించారు.

Read More : ఎన్టీఆర్ జిల్లాలో పిల్లలను చంపి పారిపోయిన తండ్రి విశాఖలో అరెస్టు