మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్‌పేట్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్రంగూడ, మల్లాపూర్, మామిడిపల్లి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆమె మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల అధికారులను సమావేశానికి పిలిపించి సమస్యల పరిష్కారంలో చూపుతున్న నిర్లక్ష్యంపై ఆమె గట్టిగా ప్రశ్నించారు. “సరిగ్గా పని చేస్తున్నారా? లేక టైంపాస్ కోసం కార్యాలయానికి వస్తున్నారా?” అంటూ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న శానిటేషన్, రోడ్లు, కాల్వలు, డ్రైనేజ్ సమస్యలను ఆమె అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని హెచ్చరిస్తూ, నిర్ణీత గడువులోపే అన్ని పనులను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డీఈఈ వెంకన్న, మేనేజర్ నాగేశ్వరరావు, ఏఈ హరీష్, ఏవో అరుణ, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, టీపీవో కిరణ్ కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు రాకేష్, వినయ్, కల్యాణ్, సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో సబితా స్పష్టంగా హెచ్చరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యతను అధికారులు మరవకూడదని స్పష్టం చేశారు.
Read More : సోషల్ మీడియా రీల్స్‌కు బానిసలవొద్దు

One thought on “బడంగ్‌పేట్ కార్పొరేషన్ అధికారులపై సబితా ఇంద్రారెడ్డి అసహనం”
Comments are closed.