టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నా, వార్తల్లో మాత్రం చురుకుగా ఉంటున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ఆమె ఆరోగ్య నిపుణి రాశి చౌదరితో కలిసి రుతుక్రమ సమస్యలపై చర్చించారు.
సమంత తన అనుభవాలను పంచుకుంటూ, ఎండోమెట్రియోసిస్ వంటి దీర్ఘకాలిక రుతుక్రమ సమస్యలపై మాట్లాడారు. ఈ వ్యాధితో తాను పడిన కష్టాలను వివరించారు. మహిళల ఆరోగ్యాన్ని పురుషులు కూడా అర్థం చేసుకోవాలని, దీనిపై అవగాహన పెరగాలని సూచించారు. సమంత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కెరీర్ పరంగా మాట్లాడితే, మయోసైటిస్ కారణంగా సినిమాలకు కొంత విరామం తీసుకున్న సమంత ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్‌కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం “రక్త్ బ్రహ్మాండ్” అనే యాక్షన్ సిరీస్‌లో మహారాణి పాత్రలో నటిస్తున్నారు.
ఇంకా సమంత తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై “మా ఇంటి బంగారం” మూవీని ప్రకటించారు. అలాగే “శుభం” అనే మరో సినిమా కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నటిగా, నిర్మాతగా సమంత తీసుకోబోయే కొత్త ప్రయాణం ఎలా ఉంటుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

One thought on “ఆరోగ్యంపై అవగాహన పెంచుతున్న సమంత!”
Comments are closed.