మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నుంచి పెద్ద షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో జగన్‌కు చెందిన రూ.800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
2009-2010 కాలంలో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో, తాజాగా హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న భూములు, వాటా ఉన్న షేర్లను ఈడీ అటాచ్ చేసినట్టు సమాచారం.
జగన్ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన కంపెనీలకు లాభాలు చేకూర్చారని, దానికి బదులుగా వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు జగన్ కుటుంబం, ఆయన సహచరులు, బినామీల పేరిట ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలో ఈ కేసుకు సంబంధించి జగన్ సుమారు 16 నెలలు చర్లపల్లి జైలులో ఉన్నారు. సీబీఐ దర్యాప్తు అనంతరం, మళ్లీ ఈడీ దూకుడును పెంచుతూ తాజాగా 800 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
ఈ కేసులో పునీత్ దాల్మియా కంపెనీకి చెందిన రూ.793 కోట్ల ఆస్తులను ఈడీ అధికారికంగా జప్తు చేసినట్లు ప్రకటించింది. కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనులను దాల్మియా సిమెంట్స్‌కు కట్టబెట్టిన విషయం విచారణలో తేలింది. దానికి ప్రతిఫలంగా ఆ కంపెనీ నుంచి నేరుగా లేదా మద్యం కంపెనీల ద్వారా నిధులు అందుకున్నట్లు సీబీఐ, ఈడీ గుర్తించాయి.
2011లో సీబీఐ కేసు నమోదు చేసి, 2013లో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్ లకు మధ్య క్విడ్ ప్రో కో వ్యవహారం చోటు చేసుకున్నట్టు సీబీఐ, ఈడీ రెండు సంస్థలు స్పష్టంగా పేర్కొన్నాయి.
ఈ కేసులో 14 ఏళ్ల తర్వాత కీలకమైన ఆస్తుల జప్తుతో జగన్‌పై చట్టపరమైన ఒత్తిడి మరింతగా పెరిగినట్టయింది.
Read More : గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు క్రీస్తు త్యాగాన్ని స్మరించిన జగన్

One thought on “జగన్‌కు ఈడీ నుండి భారీ ఎదురుదెబ్బ — రూ.800 కోట్ల ఆస్తులు జప్తు”
Comments are closed.