పాకిస్థాన్‌పై భారత్ చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతీ ఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ తరఫున వచ్చే మంగళవారం ఉదయం తమిళనాడులోని తిరుత్తణి, తిరుచెందూర్, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిర్చోళైల్లో ప్రతి క్షేత్రానికి ఒక జనసేన శాసనసభ్యుడిని, జనసైనికులను పంపించి ప్రత్యేక పూజలు నిర్వహించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.
అదే విధంగా, కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర ఆలయం, పిఠాపురం పురూహూతిక దేవి ఆలయాలలో పూజలు నిర్వహించాలని సూచించారు.
ప్రతీ సైనికుడికి సూర్యశక్తి తోడుండేందుకు, వచ్చే ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించే వారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారు మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని పవన్ కల్యాణ్ కోరారు.
Read More : తిరుమలలో హై అలర్ట్
