తాడేపల్లిలో యువజన విభాగంతో జగన్ సమావేశం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు (జూలై 1) యువజన విభాగం ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరుగనుంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, యువతలో విశ్వాసం పెంపొందించే అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. యువజన విభాగం నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను జగన్ సమీక్షించనున్నారని సమాచారం.

Read More : రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవనంపై కీలక వ్యాఖ్యలు

One thought on “తాడేపల్లిలో యువజన విభాగంతో జగన్ సమావేశం

Comments are closed.