తమిళనాడు ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టిలో దారుణం చోటుచేసుకుంది.
రసూల్ (35) అనే వ్యక్తి తన భార్య చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు గతంలో అమ్ముబీతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, అమ్ముబీకి అదే గ్రామంలో సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్ అనే వ్యక్తితో గాఢ సంబంధం ఏర్పడింది. భర్త రసూల్ అడ్డు అవుతున్నాడని భావించిన ఆమె, అతన్ని తప్పించేందుకు ఘోర నిర్ణయం తీసుకుంది. సాంబార్లో విషం కలిపి భోజనంగా వడ్డించింది. ఆ భోజనం తిన్న కొద్ది సేపటికే రసూల్‌కు వాంతులు వచ్చాయి. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అమ్ముబీ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా.. లోకేశ్వరన్‌తో ఆమె అక్రమ సంబంధం మరియు హత్యకు సంబంధించి చాట్స్ బయటపడ్డాయి.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అమ్ముబీతో పాటు లోకేశ్వరన్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన అక్కడ తీవ్ర కలకలం రేపుతోంది.
Read More : 3,000 మంది అథ్లెట్లకు నెలకు ₹50,000 స్టైపెండ్

One thought on “ప్రియుడి కోసం భర్తను విషం ఇచ్చి హత్య చేసిన భార్య!”
Comments are closed.