అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యవహారశైలితో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరూ చట్టానికి అతీతులు కాదని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిన ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్టయినట్లు చూపే ఓ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒవల్ ఆఫీసులో ట్రంప్, ఒబామా చర్చించుకుంటుండగా ఎఫ్‌బీఐ అధికారులు వచ్చి ఒబామాను అరెస్టు చేస్తారు. బేడీలు వేసి, ఖైదీ దుస్తులు తొడిపించి, జైలు సెల్‌లోకి తీసుకెళ్లే దృశ్యాల్ని ఈ వీడియోలో చూపించారు. జైలు ఊచల వెనక ఒబామా నిల్చొన్న దృశ్యంలో ఈ వీడియో ముగుస్తుంది.
అయితే, ఈ వీడియో పూర్తిగా కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించినదే. కానీ దీన్ని పోస్ట్ చేసిన ట్రంప్ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం వివాదానికి దారి తీసింది.
పలు రాజకీయ పార్టీలు, నిపుణులు ట్రంప్ చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. “భారతీయులకే కాదు, అమెరికన్లకూ నకిలీ కంటెంట్‌పై స్పష్టమైన హెచ్చరికలు అవసరం” అంటూ పలువురు నాయకులు అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతారహితంగా ప్రవర్తించడమేనని వారు విమర్శించారు. ఈ వీడియో వాస్తవ ఘటన కాదన్న స్పష్టత లేకుండా ప్రసారం చేయడం వల్ల ప్రజలలో అపోహలు కలగవచ్చని, ఇది ఎన్నికల వేళ మరింత ఉద్రిక్తతలకు దారి తీయొచ్చని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Read More : ఉక్రెయిన్‌పై మళ్లీ రష్యా దాడులు

One thought on “అమెరికాలో ఒబామా అరెస్టు వీడియోపై వివాదం”
Comments are closed.