3,000 మంది అథ్లెట్లకు నెలకు ₹50,000 స్టైపెండ్

2036 ఒలింపిక్స్‌ కోసం భారత్‌ను టాప్-5 దేశాల్లోకి చేర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున క్రీడా రంగ అభివృద్ధికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతిభ కలిగిన 3,000 మంది అథ్లెట్లకు నెలకు ₹50,000 చొప్పున స్టైఫండ్ అందించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందించి, యువతను అంతర్జాతీయ స్థాయిలో పోటీకి సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఆటగాళ్లకు ఆర్థికంగా బలమిచ్చి, వారి శారీరక మరియు మానసిక శిక్షణపై దృష్టిసారించేలా ఈ స్టైఫండ్ ఉపయోగపడనుందని తెలిపారు.

ఈ చర్యతో అథ్లెట్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, దైనందిన అవసరాలను తీర్చుకోవడంలోనూ సహాయం అందుతుంది. అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ప్రదర్శనకు ఇది దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2036 ఒలింపిక్స్‌లో భారత్‌ టాప్-5లో ఉండేలా ప్రతి రంగానూ శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ ప్రగతిశీల నిర్ణయం భారత క్రీడా రంగానికి ఊతమిచ్చేలా ఉండనుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More : పంజాపూర్‌లో ఏసీ బస్ టెర్మినల్ ప్రారంభం

One thought on “3,000 మంది అథ్లెట్లకు నెలకు ₹50,000 స్టైపెండ్

Comments are closed.