రోజుకు ఎన్ని నిమిషాలు నడవాలో తాజా అధ్యయనంలో వెల్లడి

వెన్ను లేదా నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించడంలేదా? అయితే ఇకపై ఆందోళన అవసరం లేదు. ఈ సమస్యకు మందులు కాకుండా, ఒక సాధారణ అలవాటుతో శాశ్వత పరిష్కారం పొందవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆ అలవాటు ఏంటంటే… ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం. ఆహారపు నియమాలు పాటిస్తూ, రోజూ కొంతసేపు నడవడం వల్ల వెన్నునొప్పి తీవ్రత తగ్గిపోతుందని పరిశోధకులు తెలిపారు.

2022 అధ్యయనం ప్రకారం, భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే వెన్ను నొప్పితో బాధపడే వారి శాతం అధికంగా ఉంది. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, కార్మికులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రోజంతా స్క్రీన్‌ల ముందు కూర్చోవడం, డెస్క్ వర్క్ చేయడం, డ్రైవింగ్ వంటి కారణాలతో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. దీన్ని డెడ్ బట్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు.

JAMA నెట్‌వర్క్ ఓపెన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, రోజుకు 78 నిమిషాలకి పైగా నడిచే వ్యక్తుల్లో దీర్ఘకాలిక వెన్నునొప్పి వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల నడుము ఆరోగ్యంగా ఉండటమే కాదు, శరీర ధాటిని కూడా మెరుగుపరుచుకోవచ్చు.

సంక్షిప్తంగా చెప్పాలంటే – రోజుకు దాదాపు 1 గంట 20 నిమిషాల పాటు నడవడం ద్వారా వెన్నునొప్పిని నివారించవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మందులు లేకుండానే, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ఈ సరళమైన మార్గాన్ని మీరు కూడా ప్రయత్నించండి.

Read More : పిల్లల స్క్రీన్ వినియోగంపై WHO కీలక హెచ్చరిక

One thought on “రోజుకు ఎన్ని నిమిషాలు నడవాలో తాజా అధ్యయనంలో వెల్లడి

Comments are closed.