పిల్లల స్క్రీన్ వినియోగంపై WHO కీలక హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా గైడ్‌లైన్స్ ప్రకారం, చిన్న పిల్లల స్క్రీన్ వినియోగంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. రెండు సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ స్క్రీన్లను పూర్తిగా నివారించాలన్న సిఫార్సును WHO చేసింది. అదే సమయంలో, 2 నుంచి 4 ఏళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలకు రోజుకు గరిష్టంగా ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్ ఉండాలని సూచించింది. ఈ సూచనలతోపాటు, ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు వాడటం వల్ల చిన్నపిల్లల మెదడు పనితీరు, ఐక్యూలో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నదని WHO హెచ్చరించింది.

చిన్న వయస్సులోనే స్క్రీన్‌లపై ఎక్కువ ఆధారపడటం వల్ల మానసిక వికాసం మందగించడంతో పాటు, సామాజికంగా కలవడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పిస్తూ, మితమైన స్క్రీన్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నది WHO సూచన.

Read More : మూత్ర నియంత్రణ లోపం: అవగాహన లేక పెద్ద సమస్య

One thought on “పిల్లల స్క్రీన్ వినియోగంపై WHO కీలక హెచ్చరిక

Comments are closed.