రజినీని కలిసిన కమల్ హాసన్

మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన తన స్నేహితుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభలో అడుగుపెట్టే మలుపు దశలో తన ఆనందాన్ని సన్నిహితుడితో పంచుకున్నారు.

ఈ సందర్భంగా రజినీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోలను కమల్ హాసన్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో షేర్ చేస్తూ – “కొత్త ప్రయాణానికి ముందు నాకు ఎంతో ఇష్టమైన స్నేహితుడితో నా ఆనందాన్ని పంచుకున్నాను. ఈ క్షణం నాకు ఎంతో సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. గతంలో కమల్ హాసన్ తన రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల మధ్య చురుకుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీ ప్రస్తుతం విపక్ష ఇండియా కూటమిలో భాగంగా ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలిపిన కమల్ హాసన్, తమిళనాడు మరియు పుదుచ్చేరిలో ప్రచారం నిర్వహించారు. దీనికి ప్రతిఫలంగా కమల్‌ను రాజ్యసభకు పంపాలని డీఎంకే నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన త్వరలో ఎంపీగా ప్రమాణం చేయనున్నారు.

Read More : అది జక్కన్నకు మాత్రమే తెలుసు – రానా