ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో అధికారులు పంపిన నోటీసులకు ఆయన స్పందిస్తూ విచారణకు హాజరైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈడీ అధికారులు ప్రకాశ్ రాజ్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు సహా మొత్తం 29 మందికి ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్ ప్రచారం పేరుతో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ, దీనిపై దర్యాప్తు జరుపుతోంది.
Read More : రమ్యపై బెదిరింపులు తీవ్రం
