విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు, ప్రజలకు ఊరట కలిగించే వార్త వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు శుక్రవారం (ఆగస్టు 1) కీలక ప్రకటన చేసింది.
రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేసింది. గతంలో కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ, ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేశామని కేంద్రం వెల్లడించింది.
ఈ ప్రకటనతో ప్లాంట్ ఉద్యోగులు, స్థానిక ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Read More : మహిళలపై వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

One thought on “విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊరట”
Comments are closed.