ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి పూర్తిగా అన్యాయం. గతంలో జైలు వద్ద పోలీసు ఆంక్షలు ఎలా ఉండేవో, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఇది కక్షసాధింపు తప్ప మరొకటి కాదు” అని విమర్శించారు.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మిథున్ రెడ్డికి తగిన సౌకర్యాలు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. అదే జైలులో మాజీ సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇలాంటి వైఖరి ఎప్పుడూ ప్రదర్శించలేదని గుర్తుచేశారు. “ప్రస్తుత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటాం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి మరింత బలంగా, సమర్థంగా రాణిస్తారని నాకెంతో నమ్మకం” అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read More : ఏపీలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ: మంత్రి

One thought on “మిథున్ రెడ్డిపై కక్షపూరిత వైఖరి – పెద్దిరెడ్డి ఆవేదన”
Comments are closed.