Trump : భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం ట్రేడింగ్‌ సెషన్‌ నష్టాలతో ముగిసింది.

సెన్సెక్స్‌ 585.67 పాయింట్లు క్షీణించి 80,599.91 వద్ద స్థిరపడింది. గత సెషన్‌లో 81,185.58 వద్ద ముగిసిన సూచీ, ట్రంప్‌ సుంకాల ప్రకటన ప్రభావంతో 81,074.41 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. ఫార్మా, ఐటీ రంగాల్లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్‌ ఒక దశలో 80,495.57 కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 203 పాయింట్లు నష్టపోయి 24,565.35 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ సూచీలో టాటా స్టీల్‌, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, బీఈఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీసీఎస్‌ వంటి ప్రముఖ షేర్లు నష్టాలను చవిచూశాయి. అయితే ట్రెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఐటీసీ వంటి కొన్ని షేర్లు లాభాలతో నిలిచాయి.

రంగాల వారీగా నిఫ్టీ ఫార్మా 759 పాయింట్లు (3.33%), నిఫ్టీ ఐటీ 652 పాయింట్లు (1.85%), నిఫ్టీ ఆటో 244.90 పాయింట్లు (1.04%), నిఫ్టీ బ్యాంక్‌ 344.35 పాయింట్లు (0.62%) భారీగా పడిపోయాయి. అయితే నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ మాత్రం 384 పాయింట్ల లాభంతో గ్రీన్‌ జోన్‌లో ముగిసింది.

Read More : ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆగ్రహం

One thought on “Trump : భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

Comments are closed.