ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా ప్రాముఖ్యతను వివరించారు. గురువారం ఆయన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21న విశాఖపట్నంలో జరుపుకోనున్నట్లు ప్రకటించారు. “యోగా మన జీవనశైలిలో భాగంగా మారాలి. ఇది మనకు వారసత్వంగా వచ్చిన విలువైన సంపద,” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, యోగా ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. “శస్త్ర చికిత్స కన్నా నివారణే మంచిది. యోగా అలాంటి ప్రివెంటివ్ మెడిసిన్,” అని అన్నారు. ఇకపై యోగాకు సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ శిక్షణలు, కోర్సులు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. త్వరలో యోగా నెలను అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు.
యోగా కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది నమోదు కావాలనుకున్నామని, కానీ 2.30 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్ పూర్తయిందని చంద్రబాబు వివరించారు. ఇది 120 శాతం టార్గెట్‌ను అధిగమించడం ఇదే ప్రథమమని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు 88.71 శాతం మంది ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు.
ఈనెల 21న విశాఖపట్నంలో జరిగే యోగా ఈవెంట్ గిన్నిస్ రికార్డు సాధించేలా జరుగుతుందని చెప్పారు. 26 కిలోమీటర్ల పరిధిలో 3.19 లక్షల మంది పాల్గొననున్న ఈ వేడుకకు 326 విభాగాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.29 లక్షల ప్రాంతాల్లో యోగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. “ప్రతి ఒక్కరు యోగా అలవర్చుకుంటే ఆరోగ్యకరమైన సమాజం అవుతుంది,” అని సీఎం చంద్రబాబు సూచించారు.
Read more : ఫోన్ ట్యాపింగ్ వివాదంపై జగన్ స్పందన
Our YouTube Channel Click Here

2 thoughts on “CM : భారీగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం”
Comments are closed.