విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) డిమాండ్ చేసింది.
హెచ్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధులు కేవీ జగన్నాథరావు, వీఎస్ కృష్ణ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ఒకేసారి 34 విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఉక్కు ఉత్పత్తి అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమ కావడంతో, శిక్షణ పొందిన నిపుణులే దానిని నడపాలని, ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఫార్మా సిటీల్లో జరిగినట్లే ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇకపోతే, వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, వారిని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటైనదని గుర్తుచేస్తూ, దానిని ప్రైవేటు సంస్థల కోసం నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యానికి తగదని హెచ్‌ఆర్‌ఎఫ్ స్పష్టం చేసింది.
Read More : ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం భేటీ

One thought on “విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై హెచ్‌ఆర్‌ఎఫ్ అభ్యంతరం”
Comments are closed.