టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగాలకు లోనైన సంఘటనను సీనియర్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వెల్లడించాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా ఓటమి అనంతరం కోహ్లీ బాత్రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపాడు.
ఆ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా పోరాడినప్పటికీ భారత్ పరాజయం తప్పలేదని చాహల్ గుర్తుచేసుకున్నాడు. “ఆ ఓటమి తర్వాత కోహ్లీ ఏడుస్తున్నాడు. అతనే కాదు, జట్టులోని ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. చివర్లో నేను బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు కోహ్లీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి” అని చాహల్ చెప్పాడు.
ధోనీకి అదే చివరి వరల్డ్‌కప్ మ్యాచ్ కావడంతో జట్టు అంతా భావోద్వేగానికి లోనైందని పేర్కొన్నాడు. “మరిన్ని 15 పరుగులు తక్కువ ఇచ్చి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో. నేను కూడా మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది” అని చాహల్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో చాహల్ 10 ఓవర్లు వేసి 63 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు.
Read More : డిసెంబర్‌లో భారత్ పర్యటనకు మెస్సీ

One thought on “2019 వరల్డ్‌కప్ ఓటమి తర్వాత బాత్రూంలో ఏడ్చిన కోహ్లీ”
Comments are closed.