ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 2025లో భారతదేశాన్ని సందర్శించనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత క్రికెట్ ఆటగాళ్లతో కలిసి ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. అభిమానులను అలరించే ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ముంబైతో పాటు మెస్సీ కోల్‌కతా, ఢిల్లీ నగరాలను కూడా సందర్శించనున్నారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా పలు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని అభిమానులతో మమేకం కానున్నారని సమాచారం.
భారత్‌లో మెస్సీ పర్యటన ఫుట్‌బాల్ అభిమానులకు మాత్రమే కాకుండా క్రీడాభిమానులందరికీ విశేష ఆకర్షణగా నిలవనుంది. త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Read More : సెలెక్టర్లపై అభిమన్యు ఈశ్వరన్ తండ్రి ఆగ్రహం
