కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు హైకోర్టులో పెద్ద ఊరట

తెలంగాణ హైకోర్టు కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలకు పెద్ద ఊరట కల్పించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమపై ఫేక్ వీడియో సృష్టించి ప్రచారం చేశారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేయడంతో ఇద్దరి మీద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం, కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిలపై ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ, నమోదైన కేసులను కొట్టివేసింది.

ఈ తీర్పుతో ఇద్దరు నేతలకు ఊరట లభించింది.