గాజా ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ దాడులు

గాజా నగరంపై ఇజ్రాయెల్ దళాలు మరోసారి ఘాతుకమైన వైమానిక దాడులు నిర్వహించాయి. దక్షిణ గాజాలో గురువారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఖాన్ యూనిస్ నగరంపై రాత్రిపూట 10 సార్లు వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని నాజర్ ఆసుపత్రికి తరలించారు, మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తీసుకెళ్లారు.

ఇవి కాకుండా, బుధవారం ఉత్తర, దక్షిణ గాజా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 22 చిన్నారులు సహా మొత్తం 70 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమ ఆసియా పర్యటన సమయంలో చోటు చేసుకున్నవి. ప్రస్తుతం ట్రంప్ గల్ఫ్ దేశాల్లో ఉన్న నేపథ్యంలో, ఆయన ఈ ప్రాంత పర్యటన కాల్పుల విరమణ ఒప్పందానికి లేదా గాజాకు మానవతా సహాయం పునరుద్ధరణకు దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More : “నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్”