తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన బుధవారం ఎక్స్ (పూర్వపు ట్విటర్) వేదికగా చేసిన పోస్టులో, “రేవంత్ రెడ్డి దుష్ప్రవర్తన కారణంగా ప్రభుత్వ అధికారులు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చునని సుప్రీంకోర్టు స్వయంగా హెచ్చరించింది” అని తెలియజేసారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విక్రయం వెనక రూ.10వేల కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించిన కేటీఆర్, పచ్చదనాన్ని నాశనం చేయడానికి బుల్డోజర్లను మోహరించడం పర్యావరణ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించారు.
“రేవంత్ ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి వచ్చే చర్యలకు సిద్ధంగా ఉండాలి. ఈ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని వాటిల్లే ప్రమాదం ఉంది” అని కేటీఆర్ చెప్పారు.
గచ్చిబౌలిలోని కంచ అడవులను తప్పనిసరిగా రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన కేటీఆర్, ఈ వ్యవహారంలో జరిగిన తప్పిదాలకు పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Read More : గచ్చిబౌలిలో ఉద్యోగాల పేరుతో మోసం

One thought on “CM పాలనలో అధికారులు జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది.”
Comments are closed.