అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఒక హృద్యమైన సంఘటన చోటుచేసుకుంది. సభలో మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్‌కు గొంతు సంబంధిత ఇబ్బంది తలెత్తింది. పవన్ తన 11 నిమిషాల ప్రసంగంలో కొంత అసౌకర్యంగా భావించాడు.
ఈ పరిస్థితిని ప్రధాని మోదీ గమనించారు. ప్రసంగం అనంతరం పవన్ తన సీటులో కూర్చోబోతుండగా మోదీ పిలిచి అభినందనలు తెలిపారు. అనంతరం తన జేబులో నుంచి విక్స్ తీసి పవన్ చేతిలో పెట్టారు. “గొంతు జాగ్రత్త”.. అంటూ ఆప్యాయంగా సూచించారు. ఆ సమయంలో పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు.
ప్రధాని మోదీ తరచూ దీర్ఘకాలిక ప్రసంగాలు చేస్తారు. అందుకే తన వెంట విక్స్‌ను ఎప్పుడూ ఉంచుతారనే సంగతి ఆ సందర్భంలో వెల్లడైంది. ప్రధాని మోదీ చూపించిన ఈ చిన్నదైన కానీ ఆప్యాయతతో కూడిన హావభావం సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
Read More : సీఎం చంద్రబాబు అభివృద్ధి సంకల్పం..

One thought on “సభలో విక్స్ ఇచ్చిన ఆసక్తికర దృశ్యం”
Comments are closed.