ఉగ్రదాడిపై టాలీవుడ్ గళమెత్తింది: కఠిన చర్యలపై డిమాండ్

Vijay Deverakonda on Pahalgam terror attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ కాల్పుల్లో 28 మంది మృతి చెందడం హృదయ విదారక విషయం. ఈ దాడిని దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాదులను క్షమించరాదని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ఈ దారుణంపై పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “28 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన క్షమించలేనిది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని తెలిపారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “రెండు సంవత్సరాల క్రితం అక్కడే పుట్టినరోజు జరుపుకున్నాను. పర్యాటకులపై కాల్పులు జరపడం పిరికిపంద చర్య” అంటూ ఉగ్రవాదుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పహల్గాంలో గతంలో షూటింగ్ చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. నాని, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్ బాబు, అక్షయ్ కుమార్‌, సంజయ్ దత్‌, జాన్వీ కపూర్‌, సోనూసూద్‌లు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, పహల్గాంలో శాంతి నెలకొలాలని కోరారు.

ఇటీవల చిత్రీకరణల్లో పాల్గొన్న అనుభవాల ఆధారంగా, కశ్మీరీ ప్రజల ఆతిథ్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఇలాంటి చర్యలు వారిపై చెడు ప్రభావం చూపకూడదని సెలబ్రిటీలు పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలను దనింపుతూ, కేంద్రం నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

Read More

One thought on “ఉగ్రదాడిపై టాలీవుడ్ గళమెత్తింది: కఠిన చర్యలపై డిమాండ్

Comments are closed.