రకుల్‌ పై ప్రెగ్నెన్సీ రూమర్స్‌ – ఎంత వరకు నిజం?

Rakul Preet Singh pregnancy rumors

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రకుల్, ఇటీవల బాలీవుడ్‌లో తన అడుగులు వేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో పడి, గత ఏడాది ఫిబ్రవరి 21న పంజాబీ, సింధీ సంప్రదాయాల్లో వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వారు తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ గర్భవతి అయ్యిందన్న వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని రకుల్ గానీ, జాకీ గానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌లో వచ్చిన మార్పులు, టైట్ ఫిట్ గ్లామర్ డ్రెస్సులకు బదులుగా కంఫర్ట్ వేర్ లో కనిపిస్తుండటం, సోషల్ మీడియాలో పోస్టులు – ఇవన్నీ నెటిజన్లకు సందేహాలు రేకెత్తించాయి. జాకీ ఓ వీడియోలో వంట చేస్తున్న దృశ్యం మరింతగా ఈ వార్తలకు బలం చేకూర్చింది.

అంతేకాక, ఇటీవల రకుల్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం, వ్యక్తిగత బ్రేక్ తీసుకుంటున్నానని ప్రచారం కావడంతో ఆమె తల్లి కాబోతున్నట్లు ఊహాగానాలు మరింత బలంగా మారాయి. ప్రస్తుతం రకుల్ తన ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తోందని, జాకీ ఆమెను ప్రేమగా చూసుకుంటున్నాడని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్నది మాత్రం అధికారిక ప్రకటన రాగానే తెలుస్తుంది.

Read More

One thought on “రకుల్‌ పై ప్రెగ్నెన్సీ రూమర్స్‌ – ఎంత వరకు నిజం?

Comments are closed.