జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి పాక్ మద్దతు ఉందని ఆరోపిస్తూ, భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ (NSC) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.
ఈ సందర్బంగా దార్ మాట్లాడుతూ, భారత్ ఆరోపణలను ఖండించారు. సింధు జలాల ఒప్పందం రద్దు, వాఘా-అట్టారి సరిహద్దు మూసివేత, పాక్ పౌరుల వీసాల రద్దు వంటి నిర్ణయాలను ఆయన “తీవ్రంగా, అనుచితంగా” అభివర్ణించారు. “భారత్ ఈ ఉగ్రవాద దాడిపై ఎటువంటి ఆధారాలను ఇవ్వలేదు. ప్రతి సమస్యకూ పాకిస్థాన్‌ను నిందించే అలవాటు భారత్‌కు ఉందన్నారు.
భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, పాక్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును కొనసాగిస్తే, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా వాఘా-అట్టారి సరిహద్దును తక్షణమే మూసివేస్తున్నట్టు చెప్పారు.
పాకిస్థాన్ పౌరుల భారత్‌లోకి రాకను నిషేధిస్తూ, ప్రస్తుతం భారత్‌లో ఉన్న వారికి 48 గంటల గడువు ఇవ్వబడిందని ప్రకటించారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో ఉన్న సైనిక సలహాదారులకు ఒక వారం గడువు ఇవ్వగా, భారత్ కూడా తన సిబ్బందిని ఇస్లామాబాద్ నుంచి వెనక్కు పిలుపుకుంటున్నట్లు తెలిపారు.
భారత్ తక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ అధికారికంగా స్పందించేందుకు ఎన్‌ఎస్సీ అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది.
Read More : కశ్మీర్ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలోకి

One thought on “పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ కఠిన నిర్ణయాలు”
Comments are closed.