ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఎంతో భక్తి, ఉత్సాహాలతో జరుపుకునే వరమహాలక్ష్మి పండుగ ఈరోజు దేశవ్యాప్తంగా మహిళల ఇళ్లలో వైభవంగా కొనసాగుతోంది. ఈ రోజున మహిళలు ఉపవాసం పాటిస్తూ, దీర్ఘకాల సౌభాగ్యం కోసం భక్తి పూర్వకంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. సిరుల తల్లి మహాలక్ష్మీని ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియజేశారు. మహాలక్ష్మి కృపతో ప్రతి ఇంటిలో అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, ఆనందం నిండాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో శుభ సందేశం పోస్టు చేశారు.
Read More : వివేకా హత్యపై సునీత తీవ్ర స్థాయిలో స్పందన

One thought on “వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు సీఎం”
Comments are closed.