వేదికా… తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తనదైన ముద్ర వేసుకున్న మల్టీలాంగ్వేజ్ హీరోయిన్. ‘విజయదశమి’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన వేదికా, ‘బాణం’, ‘శివలింగ’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఇస్తూ విభిన్నమైన పాత్రలతో సినీ ప్రియుల మనసు దోచుకుంది.

సినిమాల కంటే ఫ్యాషన్ ఫోటోషూట్లతో, సోషల్ మీడియా స్టైల్ పోస్ట్‌లతో తరచూ వార్తల్లో నిలుస్తున్న వేదికా, లేటెస్ట్‌గా చేసిన బ్లూ డిజైనర్ గౌన్ ఫోటోషూట్‌తో మరోసారి హీట్ పెంచింది. ఫుల్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో వేదికా సిగ్నేచర్ అటిట్యూడ్‌తో పోజులిస్తూ, యూత్‌ను ఫిదా చేసింది. నీలి మడతల డిజైన్ ఈ డ్రెస్‌కి ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెట్టగా, హీల్స్ తో కలిపి ఆమె లుక్ మరింత స్టన్నింగ్‌గా ఉంది. టోన్‌డ్ మేకప్, గ్లోయింగ్ ఫినిష్, లైట్ మాస్కారా ఐలుక్స్‌తో ఆమె అందం రెండింతలు పెరిగింది.

ఫ్యాషన్ విషయానికి వస్తే, వేదికా ఎప్పుడూ కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటుంది. ఈసారి ఆమె ఎంచుకున్న స్టైల్ కాస్త డిఫరెంట్ అయినప్పటికీ, అందుకు ఓ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. యూత్ నుండి సెలెబ్రిటీ స్టైలిస్టుల వరకూ ఈ లుక్‌పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం కొన్ని సౌత్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండగా, బాలీవుడ్‌లో అవకాశాల కోసం కూడా చూస్తోంది. ఈ బ్లూ గౌన్ లుక్‌తో మరోసారి ఫ్యాషన్ ఐకాన్‌గా వేదికా తన రేంజ్‌ను పెంచుకుంది.

One thought on “గార్జియస్ గ్లోలో వేదికా.. బ్లూ గౌన్‌లో స్టన్నింగ్ లుక్!”
Comments are closed.