ఐపీఎల్ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ఫ్రాంచైజీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తనను జట్టులో నుంచి విడుదల చేయాలని లేదా మరో జట్టుకు బదిలీ చేయాలని యాజమాన్యానికి అధికారికంగా విజ్ఞప్తి చేసినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ వార్త ఐపీఎల్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, గత కొంతకాలంగా సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మధ్య సంబంధాలు సజావుగా లేవు. ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయని, ఈ విషయాన్ని సంజు కుటుంబ సభ్యులు, సన్నిహిత క్రికెటర్లు కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
2021 నుంచి ఆర్‌ఆర్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజును, గత మెగా వేలానికి ముందు రూ.18 కోట్లకు రిటైన్ చేసి కీలక ఆటగాడిగా ప్రకటించారు. అలాంటి ఆటగాడు ఇప్పుడు జట్టును విడిచిపెట్టాలనుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇక, చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్‌పై ఆసక్తి చూపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన వేలానికి వస్తే గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ అంశంపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
Read More : అత్యాచారం ఆరోపణలపై పీసీబీ సస్పెన్షన్

One thought on “సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్‌బై చెప్పనున్నారా?”
Comments are closed.